హైదరాబాద్: 28°C
వార్తలు

కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్యా పెద్దది కాదు: నేపాల్‌ మంత్రి

భారత్‌తో సరిహద్దు సమస్యలను దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నేపాల్ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. పరస్పర గౌరవంతో కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించుకోలేని సమస్య ఏదీ ఉండదని చెప్పారు. ఇరుదేశాల సరిహద్దు సమస్య త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మానసరోవర్ యాత్రను చైనా మీదుగా వెళ్లే విధంగా ఒప్పందం చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.