ఏలూరు నియోజకవర్గంలో నిర్వహించే ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జనసేన ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ శ్రేణులకు తెలిపారు. పార్టీ కార్యాలయంలో అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
వార్తలు
ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి: ఇంఛార్జ్


