హైదరాబాద్: 28°C
వార్తలు

ఫేస్ షీల్డ్సన్స్ పంపిణీ చేసిన సీఐ

కృష్ణా: ఎండ తీవ్రత నుంచి ప్రజలను రక్షించేందుకు పెనమలూరు ట్రాఫిక్ సీఐ వాసపెద్ది రాజు ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు, ముఖ్యంగా చిన్నారులకు ఉచితంగా ఫేస్ షీల్డ్సన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.