MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. శివానంద స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పశువులకు వేస్తున్న జబ్బు వాపు, గొంతు వాపు టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం దోనూర్, వేముల, అయ్యవారిపల్లి గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న పశు వైద్య ఉపకేంద్రాలపై చర్చించారు. ఇందులో మండల పశువైద్యాధికారి డా. శివరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
మిడ్జిల్‌లో పశుసంవర్ధక శాఖ తనిఖీ


