TG: పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరగాలని అభిప్రాయపడ్డారు. సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారంలో అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఎదుర్కొనే వృత్తిపరమైన, వ్యక్తిగత సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ అసోసియేషన్ అవసరం అని అన్నారు.
వార్తలు
పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలి: DGP


