హైదరాబాద్: 28°C
వార్తలు

విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: పీఎసీఎస్ ఛైర్మన్

SRPT: కాపుగల్లు పీఎసీఎస్ కార్యాలయంలో రైతులకు 50% రాయితీపై జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ నంబూరి సూర్యం మాట్లాడుతూ, భూసారాన్ని పెంపొందించే పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే ఈ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోదాడ మండల పరిధిలోని ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.