తమిళనాడులో BJPకి అన్నామలై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆ పార్టీ తాజాగా స్పందించింది. అన్నామలై వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని బీజేపీ తమిళనాడు చీఫ్ నైనార్ నాగేంద్రన్ వెల్లడించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. కాగా, తమిళనాడులో BJPకి అన్నామలై రాజీనామా గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వార్తలు
అన్నామలై రాజీనామా వల్ల పార్టీకి నష్టం లేదు: బీజేపీ


