NLG: జీవో నెం.38 ప్రకారం బదిలీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైద్యుల సంఘం నేతలు మండిపడ్డారు.
వార్తలు
జీవో 38 అమలుకై ‘వైద్యుల’ నిరసన


