హైదరాబాద్: 28°C
వార్తలు

'మొక్కలు సంరక్షణ బాధ్యత అందరిది'

VZM: మొక్కల సంరక్షణ బాధ్యత అందరిదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్క కార్యక్రమాన్ని మెంటాడ రోడ్డులోని రైల్వే గేట్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగింది.