హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ బస్సుల అతివేగానికి చెక్..!

TPT: రహదారి ప్రమాదాల నివారణకు రవాణా శాఖ సరికొత్త GPS కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అమలు చేస్తోంది. విజయవాడలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వేగాన్ని నిరంతరం పర్య వేక్షిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో 101 కి.మీ వేగంతో ప్రయాణించిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.