హైదరాబాద్: 28°C
వార్తలు

విదేశీ నిధులను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

భారత మార్కెట్లలోకి విదేశీ నిధులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టే పెట్టుబడులపై వచ్చే మూలధన లాభాల పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.