హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు?

వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో భారీ పునర్వ్యవస్థీకరణకు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఎంపీ ప్రియాంకా గాంధీకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్‌కు కూడా ప్రధాన బాధ్యతలు లభించనున్నట్టు తెలుస్తోంది. ఖర్గే, రాహుల్ గాంధీ దీనిపై ఇప్పటికే రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారని సమాచారం.