హైదరాబాద్: 28°C
భక్తి

మూడోరోజు శ్రీసుదర్శన మహామంత్ర హోమం

TG: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో మూడోరోజు శ్రీసుదర్శన మహామంత్ర హోమం వైభవంగా జరుగుతోంది. ఈనెల 9 వరకు చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ పూజలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోమాలు, పారాయణాలు నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు నేరుగా రావడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.