హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ 50వ డివిజన్‌లో డ్రైనేజీ సిల్ట్ తొలగింపు

KNR: కరీంనగర్ 50వ డివిజన్ జ్యోతినగర్‌లో మెయిన్ డ్రైనేజీ సిల్ట్ తొలగింపు పనులు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ బంక్ చౌరస్తా నుంచి SBI బ్యాంకు వరకు డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను కార్మికులు తొలగిస్తున్నారు. డ్రైనేజీలోని మురుగునీటిని రోడ్డుపై పోయడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. వెంట వెంటనే మురుగు చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.