SRD: దీక్షా దివాస్‌ను పురస్కరించుకుని జహీరాబాద్‌లో ఆదివారం BRS శ్రేణులు కదం తొక్కాయి. స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి, మౌనం పాటించారు. అనంతరం దీక్షా దివాస్ వేదిక వద్ద BRS అధినేత KCR చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తెలంగాణ
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


