PDPL: ఎలిగేడు మండలం రాములపల్లె ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యకు పరిష్కారంగా నూతన పైపులైన్‌ను సర్పంచ్ సిద్ధ తిరుపతి యాదవ్ ప్రారంభించారు. వేసవిలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యే, సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పొట్యాల రమేశ్, డీఈ సతీశ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం


