HYD: పాతబస్తీలో రద్దీ తగ్గించేందుకు ప్రతిపాదించిన చార్మినార్ బస్ డిపో, ఖిల్వత్ ఖజానా భవనం వద్ద మల్టీలెవల్ పార్కింగ్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. టెండర్లకు స్పందన రాలేదని తెలిసింది. పత్తర్‌గట్టి, లాడ్ బజార్, గుల్జార్ హౌజ్ ప్రాంతాల్లో ఇరుకు రోడ్లపైనే వాహనాలు నిలుపుతుండటంతో కొనుగోలుదారులు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. త్వరగా పార్కింగ్ సదుపాయం కల్పించాలని వ్యాపారులు కోరుతున్నారు.
తెలంగాణ
చార్మినార్ పార్కింగ్ ఆలస్యం


