VKB: క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని అర్హత కలిగిన చర్చిలకు తెలంగాణ ప్రభుత్వం రూ.30వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. ఈ విషయాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం. సుధీర్ ఆదివారం తెలిపారు. అర్హత కలిగిన, రిజిస్టర్ అయిన చర్చిలు ఈ నెల 30వ తేదీ వరకు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం: సుధీర్


