హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా దివస్.. అమరవీరులకు నివాళులు

VKB: జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం KCR చేపట్టిన నిరాహార దీక్షను స్మరించుకుంటూ మాజీ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ BRS నాయకులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో KCR చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని తెలిపారు.