హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లె నిద్ర... ప్రజా సమస్యలపై ఆరా..!

ADB: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు బోథ్ కాంగ్రెస్ ఇంచార్జి ఆడే గజేందర్ చేపట్టిన 'పల్లె నిద్ర' బజార్హత్నూర్ మండలం గిర్నూర్‌లో కొనసాగింది. గ్రామంలో రాత్రి బస చేసిన ఆయన, ఆదివారం ఉదయం విస్తృతంగా పర్యటించి మహిళలు, యువకులతో మాట్లాడారు. మౌలిక వసతుల కొరతపై ఆరా తీసి, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గజేందర్ హామీ ఇచ్చారు.