ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు సబ్ జైలును ఆదివారం జడ్జి స్వరూప కాటం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి, ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలు, వంట గదులు, శౌచాలయాలను పరిశీలించి, ఖైదీల ఆహార మెనూను తనిఖీ చేశారు. ఖైదీలు సత్ప్రవర్తన కోసం జైలు లైబ్రరీని ఉపయోగించుకోవాలని ఖైదీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
సబ్ జైలును తనిఖీ చేసిన జడ్జి స్వరూప


