JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్షాపరులు బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందు నుంచి గోదావరి నది వద్దకు అయ్యప్ప నామ సంకీర్తనలతో శోభాయాత్రగా వెళ్లారు. గోదావరి వద్ద అయ్యప్పకు ప్రత్యేక ఆరట్టు పూజలు నిర్వహించారు.
తెలంగాణ
వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం


