హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండ్రికి తలనీలాలు.. బోరున ఏడ్చిన చిన్నారులు

JN: తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామానికి చెందిన తీగుళ్ల అశోక్ (46) సోలిపూర్‌లో భవన నిర్మాణంలో సెంట్రింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఆయనకు భార్య నరసవ్వతో పాటు ఐదుగురు చిన్నపిల్లలు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో చిన్నారులు తండ్రికి తలనీలాలు సమర్పించి బోరున విలపించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.