BDK: అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలో సిరంజీల కొరత నెలకొన్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం వచ్చిన సిరంజీలనే ఇప్పటికీ వినియోగిస్తున్నారని తెలిపారు. వైద్యశాలలో కనీస వైద్య సామగ్రి లేకపోవడం బాధాకరమని అధికారులు తక్షణమే స్పందించి సిరంజీల సరఫరా పెంచాలని, వైద్యశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని రోగులు కోరారు.
తెలంగాణ
ప్రాథమిక వైద్యశాలలో సిరంజీల కొరత


