ఉమ్మడి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం గోవిందపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తాం'


