హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమ్‌గల్‌లో కాంగ్రెస్‌ నేత ఆకస్మిక పర్యటన!

NZB: కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం భీమ్‌గల్ పట్టణంలోని పలు వార్డుల్లో బైక్‌పై ఆకస్మికంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారుల మరమ్మతులపై ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.