హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బ్లాస్టింగ్ పనులపై స్థానికుల నిరసన

MDCL: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లోని ఓ ప్రాపర్టీస్ నిర్మాణ పనుల్లో భాగంగా జరుపుతున్న బ్లాస్టింగ్‌పై స్థానికులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రీతం రెడ్డి నిరసన చేపట్టారు. అధిక శబ్దం, ప్రకంపనలు, దుమ్ము ధూళి వల్ల చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.