BHPL: పట్టణంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎస్సై గీత సూచించారు. ఆదివారం నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో విద్యార్థులతో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మత్తు పదార్థాల రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
నషా ముక్త్ భారత్ కార్యక్రమం


