హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదర్ ఉత్సవాలకు డాక్టర్ లక్ష్మారెడ్డికి ఆహ్వానం

MBNR: జడ్చర్ల పట్టణంలో ఈ నెల 4వ తేదీన యాదవ సోదరుల ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదవ సోదరులు నేడు రాజాపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. సదర్ వేడుకలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.