హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: సీఐ

CTR: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పూతలపట్టు మండలంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా CI తిమ్మయ్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తూ, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.