హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులో పడి బాలుడి మృతి

W.G: పాలకోడేరు మండలం గొల్లలకొడేరులో చెరువులో పడి పాల్ (7) మృతి చెందాడు. స్కూల్ నుంచి వచ్చాక చెరువు గట్టుపై ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. 108లో భీమవరం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలుడిని ఎవరైనా తోసేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.