KDP: వేంపల్లె మండలం కుప్పాలపల్లె గ్రామానికి చెందిన బంకా సోమేశ్వరరెడ్డితో పాటు మరో నలుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎస్సీ మహిళ రామతులసిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థికి బెదిరింపులు..ఐదుగురిపై కేసు


