విశాఖ: చినవాల్తేరులో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ మోసగాళ్లు రూ.1.68 కోట్లు మోసం చేశారు. ఏటీఎస్ అధికారులమంటూ వీడియో కాల్ చేసి, ఉగ్రవాదులకు నిధులు వెళ్తున్నాయని భయపెట్టి నకిలీ ఆర్బీఐ లేఖతో విడతలవారీగా నగదు బదిలీ చేయించుకున్నారు. మరో రూ.50 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.68 కోట్లు వసూలు


