గుంటూరు నగరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించి, వచ్చే వారం ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహించాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. పోస్టర్లు అంటించే వారిపై భారీ జరిమానాలు, రోడ్లపై నిర్మాణ సామగ్రి వేస్తే సీజ్ చేసి అపరాధ రుసుం విధించాలని సూచించారు. ఆక్రమణల తొలగింపు, విస్తరణ, నక్షా సర్వే వేగవంతం చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి: కమిషనర్


