హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలమయమైన రహదారి

తిరుపతి గ్రామీణ మండలం ఆర్సీ రోడ్డులో జాతీయ రహదారి రాళ్ళుతేలి గుంతలమయమైంది. వర్షం నీరు నిలుస్తుండటంతో ఈ పరిస్థితి తయారైంది. గుంతలు ఏర్పడినపుడు ప్యాచ్‌వర్క్ చేసి వదిలేస్తున్నారు. వర్షపునీరు నిలిచి రహదారి మరమ్మతుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు.