హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి విజయంపై ఎమ్మెల్యేల ధీమా

VZM: రాజాం MLA కొండ్రు మురళీమోహన్, పంచాయతి ఎన్నికల పరిశీలకులు PPM MLA బోనెల విజయచంద్ర శనివారం రాజాంలోని శ్యాంపురం TDP కార్యాలయంలో ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాం మున్సిపాలిటీలోని 32 వార్డులతో పాటు ఛైర్మన్‌ పీఠం కూటమి కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆదరణ, కార్యకర్తల సమష్టి కృషితో కూటమి విజయపరంపర కొనసాగుతుందన్నారు.