SKLM: వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో విషాదం చోటుచేసుకుంది. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా రాకాసి అలలకు తెప్ప బోల్తాపడి ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. అమర మోహనరావు (51) బోటు కింద చిక్కుకుని మృతిచెందారు. మిగిలిన నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. శనివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సముద్ర వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి


