హైదరాబాద్: 28°C
వార్తలు

'డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి'

JGL: జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్‌లో శుక్రవారం మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కె.రాము మాట్లాడుతూ సమాజం నుంచి మాదకద్రవ్యాల మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు.