హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ చీరల పంపిణీలో మంత్రి

ఖమ్మం నగరంలోని శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో గురువారం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత BRS ప్రభుత్వం ఇచ్చిన చీరలు నాణ్యంగా ఉండేవి కావని విమర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, సహాయ కలెక్టర్ పారస్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.