సంగారెడ్డి: జహీరాబాద్-మెట్లకుంట రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి నీలిరంగు జీన్స్ ప్యాంట్, నలుపు రంగు షర్టు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో జహీరాబాద్ GOVT ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
రైల్వే పట్టాలపై శవం కలకలం


