JN: పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామ శివారులో గురువారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో కున్సోత్ గంగమ్మ (46) అనే వివాహిత అక్కడిక్కడే మృతి చెందారు. కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామ శివారు సర్పంచ్ తండాకు చెందిన గంగమ్మ భర్తతో కలిసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి


