హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయల అమ్మవారికి విశేష అలంకరణ పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దివ్య క్షేత్రంలో శుక్రవారం అమ్మవారికి విశేష అలంకరణతో కార్తీక బహుళపక్ష చవితి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు వన దుర్గమ్మకు పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.