హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం

గద్వాల పట్టణంలో నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. టౌన్-2 ఫీడర్ పరిధిలోని గంజిపేట, రాజవీధి, గాంధీచౌక్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 9 వరకు; టౌన్-1 ఫీడర్ పరిధిలోని తెలుగుపేట, పాతబస్టాండ్, రాంనగర్ తదితర కాలనీల్లో ఉదయం 10:30 నుంచి 12 వరకు కరెంట్ ఉండదని ఏఈ శివకుమార్ తెలిపారు.