GDWL: రీసర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వేగంగా పూర్తి చేయాలని గురువారం అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆదేశించారు. గద్వాల మండలం సంగాల గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, రికార్డులను సరిపోల్చి రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
రీసర్వే పనుల్లో పొరపాట్లు రావొద్దు: అదనపు కలెక్టర్


