హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ ఇందిరమ్మ బీమా: కమిషనర్

MBNR: మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని కమిషనర్ ఎం. గిరీష్ పరిశీలించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా నమోదు చేయించాలని సూచించారు. అర్హులెవరూ మిగిలిపోకుండా మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.