హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములకలపల్లిలో ఎస్‌కేఎం ధర్నా

BDK: సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ములకలపల్లి మండల కేంద్రంలో రైతు సంఘాల నేతలు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పంటలకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పరిహారం, సీ2 ప్లస్ 50 శాతం మద్దతు ధర చట్టం, పూర్తి రుణమాఫీ డిమాండ్ చేశారు. డిమాండ్లు తీర్చకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని నేతలు హెచ్చరించారు.