HNK: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపించిందని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా కూరల్లో పురుగులు కనిపిస్తున్నాయని పేర్కొంటూ గురువారం రాత్రి గేటు వద్ద ధర్నా నిర్వహించారు. భోజన నాణ్యతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆహార నాణ్యతను పరిశీలించి, సమస్య పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
కేయూలో భోజనంలో పురుగులు


