హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

PDPL: ముత్తారం మండలం శాలగుండ్లపల్లిలో అదనపు కట్నం వేధింపులు భరించలేక బత్తుల రజిత (26) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏడాదిన్నర క్రితం వివాహమైన రజితకు 10 నెలల కుమారుడు ఉన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త సంతోష్, అత్తమామలు, బావ, తోడికోడలుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ మడత రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.