హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లబ్ధిదారుల వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలి'

ADB: బోథ్ మండలంలోని దన్నూరు, మంద బొగుడ గ్రామాలలో చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం డేటా ఎంట్రీ విధానాన్ని MPDO రమేష్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు తప్పులు లేకుండా, పారదర్శకంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అశోక్, దయాకర్, కాశిరాం, షకీల్ తదితరులు పాల్గొన్నారు.