హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ కొమిరె జంపయ్య మృతిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వేధింపుల కారణంగానే గుండెపోటుతో మరణించారని భార్య శోభ ఆరోపించారు. నాలుగు రోజులుగా విధులు కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి మృతదేహంతో వన్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు.